3, ఫిబ్రవరి 2026, మంగళవారం

జనసేన బరిలోకి 37వ డివిజన్… బీఫామ్ సమర్పించిన అభ్యర్థి...


ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని ( టౌన్ రిపోర్టర్ అరుకల విక్రమ్)

జనసేన బరిలోకి 37వ డివిజన్… బీఫాం సమర్పించిన అభ్యర్థి ....

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా 37వ డివిజన్‌కు బి ఫామ్ అధికారికంగా సబ్మిట్ చేయడం జరిగింది. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే లక్ష్యంతో,అభివృద్ధి–పారదర్శక పాలనే అజెండాగా జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తోంది..37వ డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా, మౌలిక వసతులు, పరిశుభ్రత, త్రాగునీరు, రహదారులు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థి ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకులు–కార్యకర్తల మద్దతుతో భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేశారు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి