మానసిక, శరీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతో ముఖ్యం- అంతర్గాం తహసిల్దార్ తూము రవీందర్ పటేల్...
ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని (టౌన్ రిపోర్టర్ అరుకల విక్రమ్)
మానసిక, శరీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతో ముఖ్యం- అంతర్గాం తహసిల్దార్ తూము రవీందర్ పటేల్...
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం అంతర్గాం మండల కేంద్రంలోని టీ టీ ఎస్ అంతర్గాం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల లో టీ టీ సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్గం తహసిల్దార్ తూము రవీందర్ పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి పల్లెల నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సి.ఎం.కప్ మండల స్థాయి ఆటల పోటీలు కబడ్డీ, కోకో, వాలీబాల్, లాంగ్ జంప్, రన్నింగ్ పోటీలు నిర్వహించడం జరిగిందని,క్రీడలలో గెలుపొందిన క్రీడా కారులకు బహుమతి ప్రదానోత్సవం అంతర్గాం తహసిల్దార్ తూము రవీందర్ పటేల్ చేతుల మీదుగా బహుమతులు బహూకరించడం జరిగింది.ఈ కార్యక్రమములో అంతర్గాం, బ్రాహ్మణపల్లి, పోట్యాల గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం గెలుపొందినటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలోఅంతర్గాం తహసిల్దార్ తూము రవీందర్ పటేల్, ఎం.పి.డి.ఓ. తిరుపతి, ఎం.ఇ.ఓ. ఏకాంబరం, పి.ఇ.టి.లు శోభారాణి, తిరుపతి, మౌనిక, నిర్మల అంతర్గాం, బ్రాహ్మణపల్లి, పోట్యాల గ్రామాల క్రీడాకారులు,యువకులు పాల్గొన్నారు..
కామెంట్‌లు