సిసి రోడ్డు పనులను ప్రారంభించిన - సర్పంచ్ కొలిపాక చంద్రారెడ్డి
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
సిసి రోడ్డు పనులను ప్రారంభించిన - సర్పంచ్ కొలిపాక చంద్రారెడ్డి
పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం గోలివాడ గ్రామంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సహకారంతో సర్పంచ్ సిసి రోడ్డులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొలిపాక చంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఎలక్షన్ లో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఎన్ ఆర్ జీ ఎస్ నిధులతో ఐదు లక్షల సిసి రోడ్డు ప్రారంభించడం జరిగిందని, రాబోయే కాలంలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తానని ప్రజలకు గ్రామ సర్పంచ్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొలిపాక చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ బొడ్డు ఉమా రాణి-రమేష్ , వార్డు సభ్యులు ఆవుల విజయపాల్ యాదవ్, మట్ట విష్ణు, మాజీ సర్పంచ్ ధరణి మల్లేష్,ఎనగంటి దామోదర్ రావు,బొడ్డు రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కామెంట్‌లు