4, జులై 2026, శనివారం

రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణ ఇంచార్జ్ బొడ్డుపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన 25, 26, 27, 28, 29, 30 డివిజన్ల బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA)సమీక్ష సమావేశం


 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణ ఇంచార్జ్ బొడ్డుపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన 25, 26, 27, 28, 29, 30 డివిజన్ల బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA)సమీక్ష సమావేశం

ఈ సమావేశానికి రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు హాజరై, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న SIR ప్రక్రియపై BLAలకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, ప్రతి అర్హులైన ఓటరు జాబితాలో పేరు ఉండేలా అప్రమత్తంగా పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి బూత్ స్థాయిలో పార్టీ నాయకులు, BLAలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు, BLAల పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సమావేశం అనంతరం BLAలకు రామగుండం నియోజకవర్గ BRS Party Booth Level Agent ID Cards ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి గారు, 26వ డివిజన్ కార్పొరేటర్ బాదావత్ నర్సమ్మ–సారయ్య నాయక్ గారు, మాజీ కార్పొరేటర్ నారాయణదాసు మారుతి గారు మరియు తెలంగాణ ఉద్యమ నాయకులు,పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి