ఓటరు సవరణతో పాటు అభివృద్ధి పనులపై దృష్టి – 21వ డివిజన్‌లో కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ చొరవ
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
ఓటరు సవరణతో పాటు అభివృద్ధి పనులపై దృష్టి – 21వ డివిజన్‌లో కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ చొరవ
గోదావరిఖని, జూలై 9 (ఇది మన హక్కు):
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ వీర్లపల్లిలో బూత్ నెం. 202 వద్ద ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమాన్ని కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలరావు, పిట్టల రమేష్, సొల్లు కుమార్, కలవేన అశోక్తో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు. అనంతరం డివిజన్ అభివృద్ధి పనులపై దృష్టి సారించిన కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో కొత్త నాలా ఔట్‌లెట్ నిర్మాణం, లక్ష్మీపురం రహదారి వెంట తుమ్మపొదలు, చెట్ల తొలగింపు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో వేముల స్వామి, బక్కయ్య, శ్రీనివాస్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు