కాంట్రాక్ట్ కార్మికుడు యేసురత్నం కుటుంబానికి రూ.కోటి పరిహారం – పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి: ఎఐటీయూసీ

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

కాంట్రాక్ట్ కార్మికుడు యేసురత్నం కుటుంబానికి రూ.కోటి పరిహారం – పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి: ఎఐటీయూసీ

గోదావరిఖని, జూలై 7 (ఇది మన హక్కు):
ఓసీపీ-5 మైన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు కోట యేసురత్నం కుటుంబానికి సింగరేణి యాజమాన్యం రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని ఎఐటీయూసీ రామగుండం నగర అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, యజమానిపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల భద్రత విషయంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓసీపీ-5 మైన్ వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం, షిఫ్ట్ సమయాల్లో ఎస్‌అండ్‌పీసీ సిబ్బందిని విధుల్లో నియమించడం, భారీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం అత్యవసరమని పేర్కొన్నారు. యేసురత్నం కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ఎఐటీయూసీ అండగా ఉంటుందని, అవసరమైతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కామెంట్‌లు