స్మశాన వాటిక భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసి గ్రామానికి అప్పగించాలి.. కలెక్టర్‌కు మురుమూరు గ్రామ ప్రజల వినతి

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

స్మశాన వాటిక భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసి గ్రామానికి అప్పగించాలి.. కలెక్టర్‌కు మురుమూరు గ్రామ ప్రజల వినతి

పెద్దపల్లి : జూలై 6 (ఇది మన హక్కు): మురుమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 126లో స్మశాన వాటిక కోసం కేటాయించిన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుని గ్రామానికి అప్పగించాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు గ్రామ పాలకవర్గం, ప్రజలు, యువకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్మశాన వాటిక కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఇది సాగుభూమి కాదని, గ్రామ ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్మశాన వాటిక భూమి అని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆక్రమణలను వెంటనే తొలగించి, భూమిని గ్రామ పంచాయతీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాదండ్ల సుమన్, పాలకవర్గ సభ్యులు కొదురుపాక మహేందర్, లంక మధునయ్య, మగ్గిడి రమ్య–రమేష్, వడకపురం స్వప్న–తిరుపతి, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన అధ్యక్షుడు మగ్గిడి రాకేష్, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

కామెంట్‌లు