చిన్నారుల ఆరోగ్యమే బంగారు భవిష్యత్తుకు పునాది.. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంలో కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
చిన్నారుల ఆరోగ్యమే బంగారు భవిష్యత్తుకు పునాది.. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంలో కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి
రామగుండం, జూలై 13 (ఇది మన హక్కు):
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ చంద్రబాబు కాలనీ గౌట్ స్కూల్‌లో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 48వ డివిజన్ కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ స్నేహలత, స్టాఫ్ నర్స్ సోనీ, ఏఎన్‌ఎం పద్మ, ఆయా సావిత్రి, పాఠశాల చైర్‌పర్సన్ అంజలి, హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, స్వప్న, రవళి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు