ప్రజల భద్రతే లక్ష్యం.. 12వ డివిజన్‌లో చెట్ల పొదల తొలగింపు – కార్పొరేటర్ బాబుమియ
ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️
ప్రజల భద్రతే లక్ష్యం.. 12వ డివిజన్‌లో చెట్ల పొదల తొలగింపు – కార్పొరేటర్ బాబుమియా
రామగుండం, జూలై 10 (ఇది మన హక్కు):
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్‌లో కమిషనర్ అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామి ఆదేశాల మేరకు కార్పొరేటర్ బాబుమియా పర్యవేక్షణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు.
రోడ్లకు ఇరువైపులా, నివాస గృహాల మధ్యలో పెరిగిన చెట్ల పొదలను తొలగించారు. వర్షాకాలంలో ఈ పొదల కారణంగా పాములు ఇళ్లలోకి వస్తున్నాయంటూ స్థానికులు చేసిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ బాబుమియా మాట్లాడుతూ, డివిజన్ ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. "శుభ్రత అందరి బాధ్యత.. ప్రతి పౌరుడి ఆరోగ్య భద్రతే మన లక్ష్యం" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ రంగు నాగభూషణం, పర్యవేక్షకుడు ఆడెపు శ్రీనివాస్, నాయకులు డిష్ సదానందం, తోట రమేష్, చాంద్ పాషా, సలీం, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు