ప్రభుత్వ రుణాలు పెండింగ్‌లో ఉంచొద్దు – అర్హులందరికీ వెంటనే ప్రయోజనాలు అందించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష

 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️
 
ప్రభుత్వ రుణాలు పెండింగ్‌లో ఉంచొద్దు – అర్హులందరికీ వెంటనే ప్రయోజనాలు అందించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, జూలై 9 (ఇది మన హక్కు):
ప్రభుత్వ ప్రాయోజిత పథకాల రుణ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా అర్హులైన వారికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బ్యాంకర్లను ఆదేశించారు. డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, పీఎం స్వనిధి రుణాల పంపిణీని వేగవంతం చేయాలని, తిరస్కరించిన దరఖాస్తులకు లిఖితపూర్వకంగా కారణాలు తెలియజేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఖాతాదారుడికి పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై వంటి సామాజిక భద్రత బీమా పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని, గ్రామ స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, నాబార్డ్, ఆర్బీఐ ప్రతినిధులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు

కామెంట్‌లు