నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి – మేయర్ మహంకాళి స్వామి

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి – మేయర్ మహంకాళి స్వామి

రామగుండం, జూలై 10 (ఇది మన హక్కు):
ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు సూపర్‌వైజర్లు, సంబంధిత సిబ్బంది మరింత కృషి చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ జె. అరుణశ్రీతో కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియతో పాటు పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు పోలింగ్ స్టేషన్లలో ఎస్‌ఐఆర్ పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై మేయర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీలోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేందుకు బీఎల్‌ఓలతో పాటు వార్డు అధికారులు, సహాయకులకు మల్టిపుల్ లాగిన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ నమోదు, ఫారాల నింపడంలో ఓటర్లకు సహకరించడంతో పాటు హెల్ప్‌డెస్క్ సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు.

సమావేశంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఏసీపీ శ్రీహరి, సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు