19, జులై 2026, ఆదివారం

రూ.150 కోట్ల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం.. వెంటనే స్థల సేకరణ చేపట్టాలి: మద్దెల దినేష్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

రూ.150 కోట్ల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం.. వెంటనే స్థల సేకరణ చేపట్టాలి: మద్దెల దినేష్

గోదావరిఖని, జూలై 17 (ఇది మన హక్కు): రామగుండంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటికీ స్థల సేకరణ, నిర్మాణం ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నాయకుడు మద్దెల దినేష్ అన్నారు. ప్రధాన చౌరస్తాలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు కోసం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2028 జనవరి 31లోపు డీపీఆర్ సిద్ధం చేసి నిర్మాణం ప్రారంభించకపోతే రూ.150 కోట్ల నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని లక్షలాది కార్మికులు నాణ్యమైన వైద్య సేవలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్థల సేకరణ పూర్తి చేసి ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అయిత శివకుమార్, గోలివాడ చంద్రకళ, తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి