ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం.. దళిత సంక్షేమ పథకాలపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన మద్దెల దినేష్

 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్ ✍️

ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం.. దళిత సంక్షేమ పథకాలపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన మద్దెల దినేష్

పెద్దపల్లి, జూలై 18 (ఇది మన హక్కు): పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ పలు దళిత సంక్షేమ అంశాలను కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దృష్టికి తీసుకెళ్లారు.

2018-19, 2020-21 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరైనా సుమారు 1,600 మంది లబ్ధిదారులకు రుణాలు అందలేదని, దళిత బంధు కింద పెండింగ్‌లో ఉన్న 16 యూనిట్లను మంజూరు చేయలేదని, అంబేద్కర్ అభయహస్తం పథకం అమలు లేదని, కులాంతర వివాహ ప్రోత్సాహకాలు అర్హులకు అందడం లేదని ఆయన ఆరోపించారు. అదనపు కలెక్టర్ అరుణ శ్రీ దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ ఆమెను బదిలీ చేయాలని కమిషన్‌ను కోరారు.

వినతిపై కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పందిస్తూ, ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మద్దెల దినేష్ తెలిపారు.

కామెంట్‌లు