పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి: ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూతో డిమాండ్

 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్ ✍️

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి: ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూతో డిమాండ్

రామగుండం, జూలై 14 (ఇది మన హక్కు): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (NFIW) జిల్లా ఉపాధ్యక్షురాలు శనిగరపు తిరుమల, జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల రమాదేవి డిమాండ్ చేశారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం AISF ఇచ్చిన "చలో సెక్రటేరియట్" పిలుపు నేపథ్యంలో నాయకులు రేణికుంట్ల ప్రీతం, సాగర్, సురేష్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటూ, అరెస్టు చేసిన నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి, మహిళా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నాయకులు హెచ్చరించారు.

కామెంట్‌లు