ఓసీపీ-3లో ఓబీ తరలింపులో రూ.20 కోట్ల కుంభకోణం.. విజిలెన్స్ విచారణకు మద్దెల దినేష్ డిమాండ్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
ఓసీపీ-3లో ఓబీ తరలింపులో రూ.20 కోట్ల కుంభకోణం.. విజిలెన్స్ విచారణకు మద్దెల దినేష్ డిమాండ్
రామగుండం ఆర్జీ-2 ఓసీపీ-3లో ఓబీ మట్టి తరలింపులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్‌టర్నల్ డంప్‌యార్డ్‌కు తరలించాల్సిన మట్టిని ఇంటర్నల్ డంప్‌లోనే వేసి సింగరేణి సంస్థకు రూ.15 నుంచి 20 కోట్ల వరకు నష్టం కలిగిస్తున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ఆరోపించారు.
V9 కాంట్రాక్ట్ సంస్థ నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో డంపింగ్ చేయాల్సి ఉండగా, తవ్విన ప్రాంతానికి సమీపంలోనే మట్టిని డంప్ చేస్తూ ఎక్స్‌టర్నల్ డంపింగ్ చేసినట్లు రికార్డులు సృష్టిస్తోందని, దీనికి కొందరు స్థానిక అధికారులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. దాదాపు 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిలో ఎక్కువ భాగం ఎక్కడ డంప్ చేశారనే వివరాలు లేవని అన్నారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, V9 సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని, సింగరేణి యాజమాన్యం పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు..
కామెంట్‌లు