ప్రజా సేవలో 38వ డివిజన్ కార్పొరేటర్ నేలకంటి రాము.. ఎస్‌ఐఆర్ సమీక్షతో పాటు అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️

ప్రజాసేవలో 38వ డివిజన్ కార్పొరేటర్ నేలకంటి రాము.. ఎస్‌ఐఆర్ సమీక్షతో పాటు అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

రామగుండం, జూలై 10 (ఇది మన హక్కు):
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 38వ డివిజన్ కార్పొరేటర్ నేలకంటి రాము డివిజన్‌లో ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమ పురోగతిపై బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల ధృవీకరణను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం డివిజన్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కార్పొరేటర్, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యతను స్వయంగా పరిశీలించి, వారికి వడ్డిస్తున్న భోజనాన్ని రుచి చూసి నాణ్యతను నిర్ధారించారు. చిన్నారులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం నిరంతరం అందేలా అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకురాలు, వార్డ్ ఆఫీసర్ సాయి, పసరగొండ రాంకీ, వెంకటేష్, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...