సూపర్ ఎల్‌నినోపై ముందస్తు కార్యాచరణ తప్పనిసరి: సీఎస్ సంజయ్ జాజు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

సూపర్ ఎల్‌నినోపై ముందస్తు కార్యాచరణ తప్పనిసరి: సీఎస్ సంజయ్ జాజు

 రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటి అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడంతో పాటు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సహాయాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు.
పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లా వారీగా సూపర్ ఎల్‌నినో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, ఇన్‌చార్జి మంత్రుల సమీక్ష సమావేశాలకు శాఖల వారీ సమగ్ర నివేదికలతో హాజరుకావాలని సీఎస్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, జిల్లా ప్రణాళిక అధికారి తదితరులు పాల్గొన్నారు..

కామెంట్‌లు