రామగుండం కార్పొరేషన్లో రాక్ పికర్స్ పైలట్ ప్రాజెక్ట్ రద్దుచేసి కార్మికుల ఉపాధిని కాపాడాలి తెలంగాణ కాంట్రక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మద్దతు తెలిపారు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

రామగుండం కార్పొరేషన్లో రాక్ పికర్స్ పైలట్ ప్రాజెక్ట్ రద్దుచేసి కార్మికుల ఉపాధిని కాపాడాలి 
 తెలంగాణ కాంట్రక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మద్దతు తెలిపారు

రామగుండం నియోజకవర్గంలో అతి తక్కువ సమయంలోనే అభివృద్ధిలో తనదంటూ మార్కు చూపించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు చొరవ తీసుకొని చెత్త సేకరణ చేసే కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాము                           

20 సంవత్సరాలుగా పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వీరిని ఆదుకోవాలని పైలెట్ ప్రాజెక్టులో వచ్చిన వెహికల్స్ కి పాతవారిని విధుల్లో కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి అధికారులను కోరుతున్నాం 
                                                                                గత 26 సంవత్సరాలుగా రామగుండం మున్సిపాలిటీలో రిక్షా రాక్ పిక్కర్ కార్మికులుగా కార్మికులుగా చేరి మొదట్లో నెలకు 250 మ్యాచింగ్ గ్రాట్తో ఇంటింటికి రూపాలు 5 నుంచి 10 చొప్పున యజమానుల నుండి ఆదాయం తీసుకొని జీవనం సాగిస్తున్నారు తమరి ఆదేశాల మేరకు మ్యాచింగ్ గ్రాడ్ రూపాయలు నాలుగు వేలకు పెరగడం ఇంటి యజమానుల నుండి 50 రూపాయలు తీసుకొని వెసులుబాటు రావడంతో వారి జీవితంలో కొంత వెలుగు వచ్చింది తమరి ఆశీస్సులతో ఔట్సోర్సింగ్ లో అవకాశం కల్పిస్తారని ఆశించిన కార్మికులు బతుకులపై ఎదురుదాటిగా పైలెట్ ప్రాజెక్టు ఏజెన్సీలను తీసుకురావడం అన్నది
(TCKS) తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది
మా డిమాండ్స్ 
1) రాక్ పికర్స్ 26 ఏళ్లుగా పని చేస్తున్న కొత్తగా పైలట్ ప్రాజెక్టు ఏజెన్సీలను ఏర్పాటు చేయవద్దు వాటి వల్ల కార్మికులు వారి యొక్క ఉపాధి కోల్పోవడం జరుగుతుంది
2) మున్సిపల్ కార్పొరేషన్ లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చెత్త సేకరణ కార్మికుల మహిళ గ్రూపుతో డ్వాక్రా గ్రూపులతో వారికి అండగా ఉన్న యూనియన్ తో చర్చించాలి 
3) తమకు తెలియకుండా తీసుకునే నిర్ణయాల వల్ల కార్మికులు వీధిన పడే ప్రమాదం ఉంది దానికి పూర్తి బాధ్యత అధికారులదే ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు గౌస్ మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కామెంట్‌లు