గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలి – రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఐక్యవేదిక డిమాండ్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలి – రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఐక్యవేదిక డిమాండ్
గోదావరిఖని, జూలై 9 (ఇది మన హక్కు):
గోదావరిఖని పట్టణంలో అర్బన్ తహసీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రామగుండాన్ని పూర్తిస్థాయి రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని రామగుండం స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు మద్దెల దినేష్, డాక్టర్ దుర్గం నగేష్, అయిత శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, 1.78 లక్షల మందికి పైగా ప్రజలు రెవెన్యూ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసి, రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తే ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు చంద్రకళ, కార్యదర్శి కొంకటి రవి, కంది సుజాత, సరిత లక్ష్మి, రామాదేవి, మండల శ్రీనివాస్, షీరీష, సుశీల, శారద, మల్లేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు