యువతకు, వారి తల్లిదండ్రులకుమాదకద్రవ్యాల నిషేధం పై అవగాహన సదస్సు నిర్వహించిన- అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
యువతకు, వారి తల్లిదండ్రులకుమాదకద్రవ్యాల నిషేధం పై అవగాహన సదస్సు నిర్వహించిన- అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి ముర్ ముర్ గ్రామంలో స్థానిక యువతకు, వారి తల్లిదండ్రులకు (అంటి డ్రగ్స్) మాదకద్రవ్యాల నిషేధం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకట స్వామి మాట్లాడుతూ ముఖ్యంగా యువత గంజాయి మత్తు కు అలవాటు పడి తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.గంజాయి మత్తుకు అలవాటు పడిన యువకులు చెడు స్నేహాలు చేస్తూ తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని తన విలువైన భవిష్యత్తును అంధకారంచేసుకుంటున్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడిన యువకులు అమ్మాయిలను ఏడిపించడం, డబ్బు కోసం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకోవడం, దొంగతనాలకు పాల్పడడం, అసాంఘిక కార్యకలాపాలు చేయడం వంటివి చేస్తున్నారు.రోడ్డుపై యువత మత్తులో వాహనాన్ని వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఎవరైనా గంజాయి (మాదకద్రవ్యాలు) అమ్మిన, కొన్న, మదకద్రవ్యాలను రవాణా చేసిన వారిపై మాదకద్రవ్యాల చట్టం ప్రకారం పోలీస్ కేసులు నమోదు చేయబడతాయి. కావున తల్లిదండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో నే ఉందని తల్లిదండ్రులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప- శ్రీనివాస్, అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి, కార్యదర్శి ఎస్ కమల, పోలీస్ సిబ్బంది ఏం సంతోష్, నాగరాజ్,స్థానిక యువత, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు