భాస్కర్‌రావు సేవలు కార్మిక ఉద్యమానికి చిరస్మరణీయం
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
భాస్కర్‌రావు సేవలు కార్మిక ఉద్యమానికి చిరస్మరణీయం
గోదావరిఖని, జూన్ 30 (ఇది మన హక్కు): సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ప్రముఖ కార్మిక నాయకుడు మాదిరెడ్డి భాస్కర్‌రావు 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయం వద్ద ఉన్న భాస్కర్‌రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భాస్కర్‌రావు కార్మిక హక్కుల కోసం జీవితాంతం పోరాడారని, కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కార్మికుల హక్కుల సాధన కోసం యూనియన్ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కె. స్వామి, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీనివాస్, భాస్కర్‌రావు కుమారుడు శేషు కుమార్, నాయకులు సంకె అశోక్, మాదన మహేష్, గోసిక మోహన్, కన్నం లక్ష్మీనారాయణ, కనకరాజు, సూర్య తదితరులు, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు