విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి – నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి – నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం
విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పనితీరు గ్రేడింగ్ సూచికలు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్, సమర్థవంతమైన తరగతి గది బోధనపై ప్రత్యేక దృష్టి సారించి వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

శనివారం పెద్దపల్లిలోని వెంకట పద్మ ఫంక్షన్ హాల్‌లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాణ్యమైన విద్యలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని, ఇదే స్ఫూర్తితో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులు స్వతంత్రంగా చదవడం, మాట్లాడడం, నేర్చుకున్న అంశాలను సృజనాత్మకంగా వ్యక్తీకరించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశనం చేయాలని కోరారు.

ప్రతి పాఠశాలలో వార్షిక విద్యా ప్రణాళిక, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, పాఠ్య ప్రణాళికలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక రెమెడియల్ బోధన అందించాలని సూచించారు.

డిజిటల్ వనరులు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ వంటి ఆధునిక సాంకేతికతను తరగతి గదుల్లో సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను పెంపొందించాలని తెలిపారు.

విద్యార్థుల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఆ వివరాలను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో క్రమం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. శాఖ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

సమావేశంలో జిల్లా అకాడమిక్ ప్యానల్ తనిఖీ బృంద సభ్యులను కలెక్టర్ పరిచయం చేసి, హాజరైన ఉపాధ్యాయులకు అకాడమిక్ ప్లానింగ్ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల నుంచి సుమారు 1,000 మంది ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్, జిల్లా విద్యాశాఖ ఏఎంఓ డాక్టర్ పి.ఎం. షేక్, సెక్టోరల్ అధికారులు మల్లేశ్, జీసీడీఓ కవిత, అలోకిట్, ఆర్పీ సమీర్ తదితర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...