ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి – కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి – కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్

రామగుండం, జూన్ 28 (ఇది మన హక్కు): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్‌లోని లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మానికేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొని 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకూడదని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ మానికేశ్వర్ రెడ్డి, సీఓ పారిజాతం, ఏఎన్‌ఎం అనూష, బండి సాయి, యాదన్న, పెద్ద మల్లేశం, మహిళలు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...