30, జూన్ 2026, మంగళవారం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్

రామగుండం నియోజకవర్గం : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రైతు భరోసా నిధులను విడుదల చేస్తోందని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు.

మంగళవారం బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతు భరోసా పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గి, సాగుకు అవసరమైన ఆర్థిక సహాయం అందుతుందన్నారు. రైతు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.

వ్యవసాయం లాభదాయకంగా మారేందుకు ప్రభుత్వం అన్ని విధాలా రైతులకు అండగా ఉంటుందని, రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి