ఎక్లాస్‌పూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
ఎక్లాస్‌పూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
పెద్దపల్లి జిల్లా, జూన్ 25 (ఇది మన హక్కు): రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు అంతర్గాం మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. లబ్ధిదారులు గుమ్మడి వెంకన్న, విజయలక్ష్మి దంపతులు తమ నూతన గృహంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి గృహప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జూపాక మమత-శ్రీనివాస్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి నూతన వస్త్రాలు అందజేసి సత్కరించారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం అనేక కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని సర్పంచ్ పేర్కొన్నారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఇంటి కల నెరవేరడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లగిశెట్టి రాకేష్, బరుపాటి తిరుపతి, ముఖ్య నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కామెంట్‌లు