ఛత్రపతి సాహు మహారాజ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం పోరాడాలి: బీఎస్పీ నాయకులు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
ఛత్రపతి సాహు మహారాజ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం పోరాడాలి: బీఎస్పీ నాయకులు
మారపెల్లి రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా 152వ జయంతి వేడుకలు
గోదావరిఖని: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రామగుండం నియోజకవర్గ సీనియర్ నాయకుడు మారపెల్లి రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక స్పూర్తి భవనంలో ఛత్రపతి సాహు మహారాజ్ 152వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పేగ నరేష్, కాసిపేట స్వామి ముఖ్య అతిథులుగా హాజరై సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా వికాసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్ అని కొనియాడారు. రిజర్వేషన్ల అమలుకు పునాది వేసిన మహోన్నత సంఘ సంస్కర్తగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.
అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే దూరదృష్టితో అనేక సంస్కరణలు చేపట్టిన మహనీయుడని గుర్తు చేశారు. ప్రతి మనిషి సమాన గౌరవంతో జీవించాలనే ఆయన ఆశయం నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
సాహు మహారాజ్ చూపిన మార్గంలో బహుజన నాయకులు, యువత ముందుకు సాగుతూ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్యా ప్రగతి, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత, ఆత్మగౌరవం, సేవాభావం పెంపొందించేందుకు ప్రతి బహుజన కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పులేటి పర్వతాలు, జనగామ మల్లేష్, జనగాం శంకర్, పులిపాక కైలాష్, చిలుక భాస్కర్, ఎ. స్వామి, జింక ఉదయ్, జనగాం లింగయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు