అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం,స్కూల్ యూనిఫాములను పంపిణీ చేసిన- గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప- శ్రీనివాస్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం,స్కూల్ యూనిఫాములను పంపిణీ చేసిన- గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప- శ్రీనివాస్

 ప్రీ స్కూల్ పిల్లలకు స్కూలు యూనిఫామ్స్ పంపిణీ చేసిన- రాజన్న సేవాసమితి చైర్మన్ మనాలి టాగూర్

 పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామం మోడల్ అంగన్వాడి కేంద్రంలో1లో సిడిపిఓ అలేఖ్య పటేల్ఆదేశానుసారం ప్రీ స్కూల్ పిల్లలకు అక్షరాభ్యం, స్కూలు యూనిఫామ్స్ గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప- శ్రీనివాస్ అధ్యక్షతన అంగన్వాడి కేంద్రంలో 15 మంది ప్రీస్కూల్ పిల్లలకు అక్షరాభ్యాసం స్కూల్ యూనిఫామ్స్ ఒక్కొక్కరికి రెండు జతలు చొప్పున రాజన్న సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్ యూనిఫామ్స్ ను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి రాజన్న సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్ నూతనంగా అంగన్వాడి టీచర్ పెండ్యాల విమల, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సునీత, పదవి విరమణ, నూతనంగా బాధ్యతలు పొందిన సందర్భంగా వారిని రాజన్న సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్, సర్పంచులు మగ్గిడి స్వరూప- శ్రీనివాస్, ఆంగోత్ రవికుమార్ నాయక్, కొలిపాక చంద్రారెడ్డి,మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉరిమెట్ల రాజలింగం, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి డిసిసి ప్రధాన కార్యదర్శి పూదారి సత్తయ్య గౌడ్, శాలువలతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా రాజన్న సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలోని ప్రీస్కూల్ పిల్లలకు గత కొద్ది సంవత్సరాలుగా అంగన్వాడి అంటేనే అమ్మబడి అనే విధంగా తీర్చిదిద్దిన టీచర్ పెండ్యాల విమల పదవి విరమణ పొందడం చాలా బాధాకరమని అయినప్పటికీ పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి తప్పదని,ఈ అంగన్వాడి కేంద్రం మళ్లీ యధావిధిగా మంచి పేరు తోటి నడవాలంటే ప్రస్తుతం వచ్చినటువంటి టీచర్ సునీత పిల్లలకు మంచి విద్యను అందించి, క్రమ పద్ధతిలో ఉంచి తీర్చిదిద్దాలని టీచర్ సునీతకు తెలిపారు. అనంతరం ముఖ్యఅతిథిగా హాజరైన రాజన్న సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్ ప్రీ స్కూల్ పిల్లలకు అక్షరాభ్యాసం నేర్పించి, స్కూల్ యూనిఫార్మ్స్ అందించడం జరిగింది.అనంతరం గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప, పెండ్యాల విమల రాజన్న సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్, వివిధ గ్రామాల సర్పంచులను శాలువాలతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప- శ్రీనివాస్, రాజన్న సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్, నూతనంగా అంగన్వాడి టీచర్ సునీత, పదవి విరమణ పొందిన టీచర్ పెండ్యాల విమల, పంచాయతీ కార్యదర్శి ఎస్ కమల, ఆశా వర్కర్ జ్యోతి, ప్రీ స్కూల్ కమిటీ సభ్యులు లాస్య, రవళి, భాగ్య, స్రవంతి, పద్మ, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...