23, జూన్ 2026, మంగళవారం

ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.. పరిశుభ్రత, క్రమశిక్షణపై ప్రత్యేక ఆదేశాలు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.. పరిశుభ్రత, క్రమశిక్షణపై ప్రత్యేక ఆదేశాలు

రామగుండం, జూన్ 23 (ఇది మన హక్కు): రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించి హెడ్‌క్వార్టర్స్, ఆర్‌ఐ కార్యాలయం, డాగ్ స్క్వాడ్ విభాగాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సిబ్బంది విధుల నిర్వహణ, స్పెషల్ పార్టీ బాధ్యతలు, రోజువారీ కార్యకలాపాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెడ్‌క్వార్టర్స్ పరిసరాలను పరిశీలించి, కార్యాలయాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి