అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం.. జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు: అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం.. జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు: అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ

రామగుండం, జూన్ 24 (ఇది మన హక్కు): నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశించారు.

మంగళవారం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పని పూర్తైన వెంటనే సైట్‌ను పూర్తిగా శుభ్రపరిచి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలని, సరైన కారణం లేకుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఏఈలు తేజస్విని, మనోజ్, అన్వేష్, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...