పీఆర్పీ బకాయిలు, వేతన సవరణ కోసం సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

పీఆర్పీ బకాయిలు, వేతన సవరణ కోసం సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

రామగుండం, జూన్ 29 (ఇది మన హక్కు): కోల్ ఇండియాతో సమానంగా పీఆర్పీ బకాయిలు, వేతన సవరణ, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI) – SCCL బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్జీ-1 ఏరియా అధికారులు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. జూన్ 29 నుంచి జూలై 13 వరకు జీఎం కార్యాలయం ఎదుట ఈ దీక్షలు కొనసాగనున్నాయి. తొలి విడతలో ఆర్జీ-1 ఇన్‌చార్జి అధ్యక్షుడు డా. విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శి కోల మల్లేశంతో పాటు అధికారులు దీక్షలో పాల్గొన్నారు. 2022-23 నుంచి 2024-25 వరకు పీఆర్పీ బకాయిల విడుదల, కోల్ ఇండియా తరహాలో పే అప్‌గ్రేడేషన్, సమాన అలవెన్సులు, IIT/IIM ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కోల మల్లేశం హెచ్చరించారు. కార్యక్రమంలో SCCL బ్రాంచ్ అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు, ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్, రమేష్, సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...