మేడిపల్లి రైతుల పంట పొలాలకు నీళ్లు అందియాలని సింగరేణి SO2 జిఎం కు వినతిపత్రం అందజేసిన ఒకటో డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
మేడిపల్లి రైతుల పంట పొలాలకు నీళ్లు అందియాలని సింగరేణి SO2 జిఎం కు వినతిపత్రం అందజేసిన ఒకటో డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ డివిజన్ మేడిపల్లి గ్రామ రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి తెలపడంతో వారి చూచన మేరకు శనివారం రోజున రామగుండం సింగరేణి SO2 GM చంద్రశేఖర్ గారికి వినతి పత్రం అందజేసినట్లు ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ మేడిపల్లి గ్రామం ప్రభావిత సింగరేణి అని గతంలో రైతులు పంటలు వేసుకోవడానికి సింగరేణి వారి ఆధ్వర్యంలో వేసిన నీళ్ల పైపులు తుప్పు పట్టి పైపులు విరిగిపోవడంతో పొలాలకు నీటి సరఫరా ఆగిపోయిందని పంట పొలాలకు నీళ్లు అందకపోవడంతో మేడిపల్లి రైతులు రెండు పంటలు నష్టపోయారని ఇప్పటికైన సింగరేణి ఆర్జీవన్ జిఎం గారు మరియు ఎస్,ఓటు జియం గార్లు స్పందించి వెంటనే మేడిపల్లి గ్రామ రైతులకు సాగునీరు అందించాలని పొలాలు పండించే విధంగా సహకరించాలని ఎస్ఓటు జిఎం చంద్రశేఖర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందని నేను ఇచ్చిన లెటర్ కు ఎస్ ఓటు జి ఎం గారు సానుకూలంగా స్పందించి తొందర్లోనే పైపులైను వేసే విధంగా చర్యలు తీసుకుంటామని మాట ఇవ్వడం జరిగిందని మడిపెల్లి మల్లేష్ తెలిపారు మా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఎస్ ఓ టు జిఎం చంద్రశేఖర్ గారికి మేడిపల్లి గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఒకటోవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ అన్నారు
కామెంట్‌లు