25, జూన్ 2026, గురువారం

సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలి: ఏఐటీయూసీ

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలి: ఏఐటీయూసీ

గోదావరిఖని, జూన్ 25 (ఇది మన హక్కు): సింగరేణిలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఖాకీ యూనిఫామ్‌తో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఏఐటీయూసీ రామగుండం నగర అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో ఎస్‌వో టు జీఎం కే. చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం ఉన్న బ్లూ యూనిఫామ్ స్థానంలో ఖాకీ యూనిఫామ్, లాఠీలు, టార్చ్‌లైట్లు, రెయిన్‌కోట్లు, టోపీలు, టవల్స్, డస్ట్ అలవెన్స్, నైట్ అలవెన్స్, పెట్రోల్ అలవెన్స్ కల్పించాలని కోరారు. సెక్యూరిటీ గార్డులు శ్రమ, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఇన్సూరెన్స్, పూర్తి మాస్టర్లు, సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వాహన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి