ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 48వ డివిజన్ కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 48వ డివిజన్ కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి
రామగుండం, జూన్ 26 (ఇది మన హక్కు): భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR ప్రత్యేక మ్యాపింగ్) కార్యక్రమాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్‌లో కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, TPCC నాయకత్వం సూచనల మేరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బూత్ నంబర్–87 పరిధిలో 65 మంది ఓటర్ల ప్రత్యేక మ్యాపింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో బీఎల్‌వోలు వనజ, రాజలక్ష్మి, భాగ్యలక్ష్మి, అంజలి, దివ్య, తాజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి అర్హుడైన వ్యక్తి ఓటరుగా నమోదు కావడం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పార్టీ నాయకత్వానికి డివిజన్ ప్రజల తరఫున ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు