పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి కుటుంబం సహకరించాలి – కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి కుటుంబం సహకరించాలి – కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్
రామగుండం, జూన్ 28 (ఇది మన హక్కు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 22వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్ ఎలకలపల్లి గేట్, గౌతమి నగర్ సొసైటీ, చైతన్యపురి కాలనీలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను సందర్శించి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఆరోగ్య సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం ఆసుపత్రి వైద్య సిబ్బంది, గౌతమి నగర్ సొసైటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కామెంట్‌లు