వీరనారి ఝల్కారీ బాయి చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి: డా. మార్షల్ దుర్గం నగేష్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

వీరనారి ఝల్కారీ బాయి చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి: డా. మార్షల్ దుర్గం నగేష్

ఎన్‌టీపీసీ, జూన్ 23 (ఇది మన హక్కు): 1857 తొలి స్వాతంత్ర్య సమరంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణత్యాగం చేసిన దళిత వీరనారి ఝల్కారీ బాయి కోరీ చరిత్రను వెలుగులోకి తీసుకురావాలని సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. మార్షల్ దుర్గం నగేష్ కోరారు.

ఝల్కారీ బాయి 168వ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో దళితులు, బహుజనులు, ఆదివాసీలు చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ సైన్యాన్ని మభ్యపెట్టేందుకు రాణి లక్ష్మీబాయి వేషంలో యుద్ధరంగంలోకి దిగి అపూర్వ సాహసం చేసిన ఝల్కారీ బాయి సేవలను చరిత్రలో మరుగున పడేశారని అన్నారు.

ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు జయంతి, వర్థంతులను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి వీరుడు, వీరనారికి సమాన గౌరవం లభించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డా. మార్షల్ దుర్గం నగేష్ పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...