VBSA బిల్లును వ్యతిరేకించాలి.. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణకు AISF బహిరంగ లేఖ

VBSA బిల్లును వ్యతిరేకించాలి..ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణకు AISF బహిరంగ లేఖ...

పెద్దపల్లి, జూలై 19 (ఇది మన హక్కు): రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (VBSA) బిల్లు–2025ను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో బహిరంగ లేఖ విడుదల చేసినట్లు జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం తెలిపారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపాదిత VBSA బిల్లు రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉండి, కేంద్ర–రాష్ట్రాల అధికార సమతుల్యతను దెబ్బతీస్తుందని అన్నారు. అలాగే విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని బలహీనపరచడంతో పాటు విద్యార్థులు, అధ్యాపకుల ప్రజాస్వామ్య హక్కులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉన్న UGC, AICTE, NCTE వంటి విద్యా నియంత్రణ సంస్థల స్థానంలో ఒకే సంస్థగా VBSAను ఏర్పాటు చేయడం వల్ల ఉన్నత విద్యా వ్యవస్థ కేంద్రీకృతమై, రాష్ట్రాల అధికారాలు తగ్గిపోతాయని పేర్కొన్నారు. IITలు, IIMలు, NITలు, IIITలు, IISERలు కూడా ఈ సంస్థ పరిధిలోకి రావడం వల్ల విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని విమర్శించారు.ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, విద్యా సంస్థల స్వతంత్రత, విద్యార్థుల హక్కుల పరిరక్షణ దృష్ట్యా ఈ బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకించాలని, దీనిపై సమగ్ర చర్చ జరిపి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణను AISF విజ్ఞప్తి చేసింది...


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​