ప్రమాద బాధిత కుటుంబానికి అండగా సేవా స్ఫూర్తి ఫౌండేషన్.. నిత్యావసర సరుకులు అందజేసిన అధ్యక్షుడు మడిపెల్లి మల్లేష్..
ప్రమాద బాధిత కుటుంబానికి అండగా సేవా స్ఫూర్తి ఫౌండేషన్.. నిత్యావసర సరుకులు అందజేసిన అధ్యక్షుడు మడిపెల్లి మల్లేష్..
రామగుండం జులై: 19 (ఇది మన హక్కు): ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తూ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ మానవత్వాన్ని చాటుకున్నారు.రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ పీకే రామయ్య కాలనీకి చెందిన జోగు హరిజన్ పది రోజుల క్రితం ఆటోలో ప్రయాణిస్తుండగా టైర్ పగిలి ఆటో బోల్తాపడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయనను వరంగల్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవల ఇంటికి చేరుకున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న మడిపెల్లి మల్లేష్ బాధితుడిని పరామర్శించి కుటుంబ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాన్ని ఆదుకునేందుకు 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను సేవా స్ఫూర్తి ఫౌండేషన్ తరఫున అందజేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.స్థానికులు మాట్లాడుతూ, "1వ డివిజన్‌లో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి మడిపెల్లి మల్లేష్. ఒక్క ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సహాయం అందించే వ్యక్తి" అని కొనియాడారు. కూలి పనులపై ఆధారపడి జీవించే జోగు హరిజన్ కుటుంబానికి ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు.జోగు హరిజన్ కుటుంబానికి ఆర్థిక, నిత్యావసర సహాయం అందించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్తో పాటు ఫౌండేషన్ సభ్యులకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మోహన్ సత్నామి, రాంప్రసాద్, ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు..
కామెంట్‌లు