🌧️ ఉత్తర–తూర్పు తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక.. పెద్దపల్లి సహా పలు జిల్లాలు అప్రమత్తం..!
🌧️ ఉత్తర–తూర్పు తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక.. పెద్దపల్లి సహా పలు జిల్లాలు అప్రమత్తం..!
హైదరాబాద్, జూలై 19 (ఇది మన హక్కు): తెలంగాణ రాష్ట్రంలో మరోసారి వర్షాలు ఉద్ధృతం కానున్నాయి. ముఖ్యంగా ఉత్తర–తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు విస్తృతంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు, రైతులు, వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల్లో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అదే విధంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, కామారెడ్డి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం కొనసాగినా, సాయంత్రం తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు...
⚠️ ప్రజలకు ముఖ్య సూచనలు..
🔹 ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దు.
🔹అవసరం లేకుంటే భారీ వర్షాల సమయంలో ప్రయాణాలను వాయిదా వేయండి.
🔹 రైతులు పంట పొలాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి.
🔹 లోతట్టు ప్రాంతాల ప్రజలు స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
🔹 వర్షపు నీరు నిలిచిన రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలి...
👉 తాజా వాతావరణం, బ్రేకింగ్ న్యూస్, ప్రజా సమస్యలపై విశ్వసనీయ కథనాల కోసం నిరంతరం చదవండి – ఇది మన హక్కు సమాచార పత్రిక 🌐
కామెంట్‌లు