ఇంద్రాపార్క్ వద్ద అక్టోబర్ 25న ధర్నా.. ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పిలుపు గోదావరిఖని అక్టోబర్ 23 (ఇది మన హక్కు): జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ ఉపాధ్యక్షులు, టెమ్రీస్ కౌన్సిలర్, హెచ్‌ఎంఎస్ జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ రామగుండం మండలం అల్లూరు గ్రామంలోని మస్జిద్-ఎ-ఖుబాలో శుక్రవారం జుమా నమాజ్ సందర్భంగా నిర్వహించిన ఖుత్బా కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో దేశవ్యాప్తంగా ఓటర్ల పేర్లను తొలగించే చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ, ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు ప్రజాస్వామ్యవాదులు, ముస్లిం మతపెద్దలు, యువత, విద్యార్థులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం శాంతియుతంగా జ...