నవంబర్ 22న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర సదస్సు — ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పిలుపు.
ఈ కార్యక్రమం అక్టోబర్ 13న గోదావరిఖనిలోని హోటల్ ఆదిత్య రెసిడెన్సీలో నిర్వహించగా, సుమారు 110 మంది సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభంలో ముస్తఫా ఖుర్ఆన్ పారాయణం చేశారు.
అనంతరం ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ప్రారంభోపన్యాసం చేస్తూ, 2026 నవంబర్ 22న హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ఐవైఎం తొలి తెలంగాణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. యువతలో క్రమశిక్షణ, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు సమాజ సేవ, దేశ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించేలా ఈ సదస్సు దోహదపడాలని ఆకాంక్షించారు.
సదస్సు విజయవంతానికి ముందస్తు ప్రణాళిక, సంస్థల మధ్య సమన్వయం, విస్తృత ప్రచారం, యువత భాగస్వామ్యం, రవాణా తదితర ఏర్పాట్లపై దృష్టి సారించాలని సూచించారు. అనుబంధ సంస్థల కార్యకర్తలు సమష్టిగా పనిచేసి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఐవైఎం, ఎస్ఐఓ, జీఐఓ, సీఐఓ, ఎంపీజే, దారే, ఏఐఐటీఏ సంస్థల ప్రతినిధులు, మహిళా విభాగం ప్రతినిధులు, టీఎంఆర్ఈఐఎస్ (TEMREIS) కౌన్సిలర్లు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. జమాతె ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జనాబ్ నయీముద్దీన్ అహ్మద్ సాహెబ్ ముఖ్య అతిథిగా, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు జనాబ్ అబ్దుల్ హై జావిద్ సాహెబ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. గోదావరిఖని యూనిట్ అధ్యక్షుడు ఎస్.జె.ఎ. హుస్సేనీ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
రాష్ట్ర యువజన సదస్సును విజయవంతం చేసేందుకు సమష్టి కృషి, క్రమశిక్షణ, సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశం నిర్ణయించింది.




కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి