బీఎస్సీ ఆప్టోమెట్రీలో పట్టా పొందిన అఖీలుల్లా ఖాన్
గోదావరిఖని అక్టోబర్ 11(ఇది మన హక్కు): హైదరాబాద్ – న్యూఢిల్లీ,రాజమండ్రిలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో అక్టోబర్ 7న నిర్వహించిన కాన్వొకేషన్ వేడుకలో బీఎస్సీ ఆప్టోమెట్రీ విద్యను పూర్తి చేసి పట్టా పొందిన అఖీలుల్లా ఖాన్‌కు జమాతే ఇస్లామీ హింద్ గోదావరిఖని ఉపాధ్యక్షులు, TEMRIES కౌన్సిలర్, HMS జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ అభినందనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర కార్పొరేటర్ ఖలీలుల్లా ఖాన్ తన చిన్ననాటి స్నేహితుడు, బంధువు కావడంతో ఆయన కుమారుడు అఖీలుల్లా ఖాన్ సాధించిన విద్యా విజయంపై నిజామీ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలు రషీదా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అఖీలుల్లా ఖాన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, ఆప్టోమెట్రీ రంగంలో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకకు జీఎస్ఎల్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ సోమనాథ్ దాస్, డాక్టర్ సీహెచ్. ప్రగతి, డాక్టర్ టీ. సత్యప్రకాశ్ గౌరవ అతిథులుగా, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.ఎస్. గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ
ఉపాధ్యక్షులు – JIH, గోదావరిఖని | కౌన్సిలర్ – TEMRIES | జాతీయ కార్యదర్శి – HMS

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి