దీపావళి వేళ రామగుండం అభివృద్ధికి వెలుగులు.. మసీద్ టర్నింగ్ సెంటర్ లైటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
రూ.35 కోట్లతో రోడ్లు, సెంట్రల్ లైటింగ్, యూజీడీ పనులు.. పేదల సంక్షేమమే లక్ష్యమని ఎమ్మెల్యే వెల్లడి రామగుండం (ఇది మన హక్కు), నవంబర్ 07, 2026: దీపావళి పండుగ వేళ రామగుండం పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని మసీద్ టర్నింగ్ వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ ప్రారంభించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రూ.35 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు రామగుండం పట్టణంలో సుమారు రూ.35 కోట్లతో రోడ్లు, సెంట్రల్ లైటింగ్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. బి పవర్‌హౌస్ గడ్డ (హనుమాన్ జంక్షన్) నుంచి లింగాపూర్ మీదుగా స్టేషన్ ఫ్లైఓవర్ వరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కనీస రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి డివిజన్లో మ...