బోనస్ సాధనలో హెచ్ఎంఎస్ కృషి అభినందనీయం — కార్మికులు హెచ్ఎంఎస్ సభ్యత్వం స్వీకరించాలి
గోదావరిఖని అక్టోబర్ 10 (మన హక్కు):సింగరేణి కార్మికులకు దీపావళి పండుగ సందర్భంగా రూ.1,10,250 పీఎల్ఆర్ (PLR) బోనస్ లభించడం పట్ల హెచ్ఎంఎస్ కేంద్ర కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం హెచ్ఎంఎస్ యూనియన్ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారం, మెరుగైన ప్రయోజనాల సాధనలో యూనియన్ పాత్ర కీలకమని తెలిపారు. సింగరేణి కార్మికులందరూ హెచ్ఎంఎస్ యూనియన్ సభ్యత్వాన్ని స్వీకరించి, కార్మిక ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు శాంతి స్వరూప్, బ్రాంచ్ కార్యదర్శి గోషిక శ్రీకాంత్, ఏఎల్పీ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
— ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ
కేంద్ర కార్యదర్శి, హెచ్ఎంఎస్

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి