కార్పొరేషన్‌లో పైలట్ ఏజెన్సీ విధానం రద్దు చేసి ర్యాగ్ పిక్కర్లకు ఉపాధి భద్రత కల్పించాలి: ఎం.ఎ. గౌస్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
కార్పొరేషన్‌లో పైలట్ ఏజెన్సీ విధానం రద్దు చేసి ర్యాగ్ పిక్కర్లకు ఉపాధి భద్రత కల్పించాలి: ఎం.ఎ. గౌస్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రవేశపెడుతున్న పైలట్ ఏజెన్సీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ర్యాగ్ పిక్కర్లను శానిటేషన్ ఔట్‌సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి ఉపాధి భద్రత కల్పించాలని తెలంగాణ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రామగుండం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. గౌస్ డిమాండ్ చేశారు.
సోమవారం గోదావరిఖని భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన ర్యాగ్ పిక్కర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్ పరిధిలో 26 ఏళ్లుగా చెత్త సేకరణ సేవలు అందిస్తున్న కార్మికుల జీవనోపాధికి పైలట్ ఏజెన్సీ విధానం ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం సుమారు 140 మంది కార్మికులు తక్కువ ఆదాయంతో పనిచేస్తున్నారని, అనారోగ్యం, ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
కార్మికుల సేవలను గుర్తించి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని మేయర్, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యేను కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కామెంట్‌లు