మంచినీటి శుద్ధి వాటర్ ప్లాంట్ కు సర్పంచ్ స్వయంగా పనులు చేస్తూ మరమ్మత్తులు చేపట్టిన- గ్రామ సర్పంచ్ ఆంగోత్ రవికుమార్ నాయక్
ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్ ✍️
మంచినీటి శుద్ధి వాటర్ ప్లాంట్ కు సర్పంచ్ స్వయంగా పనులు చేస్తూ మరమ్మత్తులు చేపట్టిన- గ్రామ సర్పంచ్ ఆంగోత్ రవికుమార్ నాయక్
పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం టి టి ఎస్ అంతర్గం గ్రామం గ్రామంలోని ఆర్వో మంచినీటి శుద్ధి వాటర్ ప్లాంట్ గత కొద్ది సంవత్సరాలుగా నిరుపయోగంగా మారడంతొ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామ సర్పంచ్ ఆంగోతు రవికుమార్ నాయక్ అతనే స్వయంగా ప్లాంట్ వద్ద పనులు చేస్తూ మరమ్మత్తులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఆంగోతు రవికుమార్ నాయక్ మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి శుద్ధి వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడకుండా,ఎవరు పట్టించుకోక పోవటంతో నిరుపయోగంగా మూలకుపడడంతో ఈ సమస్యను ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రజలకు నేను ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే అర్వో వాటర్ ప్లాంట్ కు మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు మంచినీరు అందే విధంగా చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే గ్రామ సర్పంచ్ తాను తనవంతుగా స్వయంగా పనులు చేస్తూ మరమ్మత్తులు మొదలుపెట్టి రెండు, మూడు రోజులలో గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రతి ఇంటికి నీరు అందే విధంగా ఆర్వో ప్లాంట్ ను శుద్ధిచేసి ప్రజలకు మంచినీరు అందిస్తానని గ్రామ సర్పంచ్ ఆంగోతు రవికుమార్ నాయక్ ప్రజలకు హామీ ఇస్తూ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆంగోతు రవికుమార్ నాయక్, పాలకవర్గం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు