ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి మాట్లాడుతూ... ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను ఏకం చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉద్యమకారుల కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని రాజకీయ కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు. తెలంగాణ ప్రకటన అనంతరం జేఏసీలో పనిచేసిన కొంతమంది నాయకులు గత ప్రభుత్వ కాలంలో పదవులు, లబ్ధులు పొందుతూ ఉద్యమకారుల సమస్యలను విస్మరించారని విమర్శించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఉద్యమకారుల హక్కుల కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించని వారు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చి కమిటీలపై పెత్తనం చేయాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రం 2018 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ఉద్యమకారుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారుల అంశాలు చేర్చేందుకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. అలాగే ఉద్యమకారులను గుర్తించేందుకు కేకే కమిటీ ఏర్పాటు చేయాలంటూ పలు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిందన్నారు. జేఏసీపై తమకు గౌరవం ఉందని, కానీ ఉద్యమకారుల కమిటీలో కొందరు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, కమిటీ సభ్యులు నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...