అత్యవసర సేవల కోసం వీధులు వెడల్పు చేయండి.. ప్రజలు సహకరించాలి: మేయర్ మహంకాళి స్వామి

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

అత్యవసర సేవల కోసం వీధులు వెడల్పు చేయండి.. ప్రజలు సహకరించాలి: మేయర్ మహంకాళి స్వామి

రామగుండం, జూన్ 21 (ఇది మన హక్కు): అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వంటి వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేలా వీధుల విస్తరణకు ప్రజలు సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. స్థానిక కార్పొరేటర్ ఇసంపల్లి అంజయ్యతో కలిసి 30వ డివిజన్‌లోని ఖాదర్ కాలనీ, ఇందిరానగర్, రహమత్ నగర్, భీమయ్య కాలనీ, వడ్డెరగూడెం, ఈఎస్ఐ కాలనీ, టెంపుల్ ఏరియా తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.

కాలువల్లో పూడిక తొలగింపు, చెట్ల కొమ్మలు, పిచ్చి మొక్కల తొలగింపు పనులను పరిశీలించిన మేయర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.20 కోట్లతో రామగుండంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 30వ డివిజన్‌లో ప్రధాన వీధులను కనీసం 20 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయడానికి మార్కింగ్ చేస్తున్నామని, ప్రజలు వారం రోజుల్లో స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగిస్తే వెంటనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

ప్రతి ఇంటికి యూజీడీ, రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, ఏఈ తేజస్విని, టీపీఎస్ నవీన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...