19, జూన్ 2026, శుక్రవారం

వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత ఉండదు: సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి

✍️ఇది మన హక్కు సమాచార పత్రిక ""మండల రిపోర్టర్...

వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత ఉండదు: సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి

హైదరాబాద్, జూన్ 19 (ఇది మన హక్కు): వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఎదురైనా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత నాణ్యమైన బొగ్గు సరఫరా చేస్తామని సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి తెలిపారు. శుక్రవారం సింగరేణి భవన్‌లో తెలంగాణ జెన్‌కో చైర్మన్ డా. హరీష్తో సమావేశమై బొగ్గు సరఫరాపై సమీక్ష నిర్వహించారు.
ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీ వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టామని, రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రణాళికాబద్ధంగా బొగ్గు సరఫరా కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏటా సుమారు 28 మిలియన్ టన్నుల బొగ్గు, రోజుకు 60 నుంచి 70 వేల టన్నుల బొగ్గు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. బొగ్గు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, జీఎం తాడబోయిన శ్రీనివాస్, తెలంగాణ జెన్‌కో అధికారులు పాల్గొన్నారు..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి