సింగరేణిలో బొగ్గు అక్రమ రవాణాకు తావులేదు.. పారదర్శక వ్యవస్థపై భట్టి విక్రమార్క సంతృప్తి

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

సింగరేణిలో బొగ్గు అక్రమ రవాణాకు తావులేదు.. పారదర్శక వ్యవస్థపై భట్టి విక్రమార్క సంతృప్తి
 
శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్  గనిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మీడియా సమక్షంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ తనిఖీలో బొగ్గు ఉత్పత్తి నుంచి రవాణా వరకు అన్ని ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సింగరేణిలో అమలవుతున్న జీపీఎస్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, ఎస్‌ఏపీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు బొగ్గు ఉత్పత్తి, నిల్వ, రవాణా ప్రక్రియలపై వివరించారు. ప్రతి వాహనం కదలిక, లోడింగ్, డిస్పాచ్ ప్రక్రియలు సీసీటీవీలు, డిజిటల్ వ్యవస్థల ద్వారా నిరంతరం పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం ఉంటే ప్రభుత్వం సరిదిద్దేందుకు సిద్ధంగా ఉందన్నారు. దీనికి స్పందించిన అధికారులు బొగ్గు అక్రమ రవాణా, దొంగతనాలకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి కార్మికుల శ్రమ, సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే నిరాధార ఆరోపణలు సరికావన్నారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, పారదర్శకత, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...