గ్రామ పరిపాలన ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి- మర్రి శంకర్ స్వామి గ్రామ పరిపాలన అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

గ్రామ పరిపాలన ప్రభుత్వఅధికారులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి- మర్రి శంకర్ స్వామి గ్రామ పరిపాలన అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుు

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గ్రామ పరిపాలన అధికారి, ఇతర రెవెన్యూ అధికారులపై దాడికి ఉసిగొల్పిన, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా గ్రామ పరిపాలన ఆఫీసర్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా గ్రామ పరిపాలన అసోసియేషన్ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి మాట్లాడుతూ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామ చెరువులో అక్రమంగా మొరం, మట్టిని తరలిస్తున్న వారిని ఆపడానికి వెళ్ళిన గ్రామపాలన అధికారి నరసింహస్వామి, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దాడికి పాల్పడిన వారికి కఠినమైన శిక్ష విధించినట్టయితే ప్రభుత్వ అధికారుల పై దాడులు ఎవరు కూడా ఇకమీదట చేయరని తక్షణమే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని,తీసుకునేలాప్రభుత్వం చూసుకోవాలని జిపిఓల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి కోరారు. ఇదే విషయాన్ని రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరనున్నట్లు జీపిఓల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జి పి ఓ ల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...